Uttam Kumar Reddy : గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాను ఈ ఆరు నెలల కాలంలో చాలా ప్రాజెక్టులను సందర్శించానని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ప్రాజెక్టు పూర్తయ్యాక సీతారామ ప్రాజెక్టు కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా పేరు పెడతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కేవలం రూ.2654 కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క ప్రాంతంలో కూడా నీరు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆగస్ట్ 15 నాటికి నల్గొండ, వైరా ప్రాంతాలకు లక్షా ఇరవై వేల ఎకరాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు కింద ఏన్కూరు లింక్ కాలువను ఆగస్టు 15లోగా పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 1.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి నీటిని అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రకటించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!