Kuwait Fire Accident: వచ్చే నెలలో వివాహం.. కొడుకు మిస్సింగ్.. ఓ తల్లి ఆవేదన..
- వచ్చే నెలలో పెళ్లి
- అంతలోనే విషాదం..
- కువైట్ అగ్నిప్రమాదంలో బీహార్ వ్యక్తి మిస్సింగ్..
- తన కొడుకుకి ఏమైందో అని తల్లి ఆవేదన..
- వచ్చే నెల ఇంటికి వస్తానని చెప్పాడంటూ కన్నీరుమున్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuwait Fire Accident: బతువుదెరువు కోపం పరాయి దేశం వెళ్లి, శవాలుగా తిరిగి వస్తున్న తమ వారిని చూస్తున్న కుటుంబాల కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. తమవారిని కాలిన మృతదేహాలుగా చూస్తామనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్ఫ్ దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా మృతుల్లో సగానికి కన్నా ఎక్కువ మంది కేరళకి చెందిన వారే ఉన్నారు. ఐఏఎఫ్ విమానంలో మరణించిన వారి మృతదేహాలను కొచ్చిన్ తీసుకువచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరిని విమానం ఉదయం 10.30 గంటలకు కొచ్చిన్ చేరుకుంది.
Read Also: T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి తన కొడుకు అదృశ్యమయ్యాడని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. వచ్చే నెలలో వివాహం కావాల్సిన తన కొడుకు సమాచారం కోసం ఎదురుచూస్తోంది. బీహార్ కి చెందిన మదీనా ఖాతూన్ అనే మహిళ, తన పెద్ద కుమారుడు కాలూ ఖాన్ అగ్నిప్రమాదం జరిగిన భవనంలోనే నివసిస్తున్నాడని చెప్పారు. ‘‘మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేను అతనితో ఫోన్‌లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు’’ అని విలపించింది. బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన ఖాతూన్, తన కుమారుడు కొన్నేళ్లుగా కువైట్‌లో నివసిస్తున్నాడని చెప్పారు.
కాలూ ఖాన్ స్కిల్ లేబర్‌గా గత కొన్ని ఏళ్లుగా కువైట్‌లో నివసిస్తున్నాడు. తన కుమారుడు ఉన్న భవనంలోనే అగ్నిప్రమాదం జరిగిందని అతని తల్లి పేర్కొంది. తాను కాల్ చేసినప్పటికీ స్పందన లేదని, కొడుకు గురించి ఎలాంటి సమాచారం అందలేదని, తన కుమారుడికి ఏం జరిగిందో తెలియడం లేదని చెప్పింది. ఈ విషయంలో అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించాం, కానీ మా ప్రయత్నం ఫలించలేదని చెప్పింది. నా కొడుకు క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!