పూణె పోర్స్చే ఘటన తరహాలో మహారాష్ట్రలో మరో ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి బారికేడ్‌ను ఢీకొట్టింది. దీంతో.. కారు టైర్ ఊడిపోయి పక్కనే వస్తున్న ఆటోకు తగలింది. ఈ క్రమంలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే.. మద్యం మత్తులో 21 ఏళ్ల యువకుడు కారును నడుపినట్లుగా తేలింది. ఈ ప్రమాదం.. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని జగ్తాప్ డెయిరీ సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Student Died: ఆర్‌టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి.. (వీడియో)
ఈ ప్రమాదంపై పోలీసులు మాట్లాడుతూ.. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని.. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తుండటంతో.. వాహనాన్ని అదుపు చేయలేక అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొట్టడాని.. దీంతో వాహనం టైర్ ఊడిపోయిందని పేర్కొన్నారు. ఈ టైర్ పక్కనే వస్తున్న ఆటోకు తగలడంతో.. ఆటో పడిపోయి అందులో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయన్నారు. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్, మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
Read Also: MK Stalin: నీట్ ‘స్కామ్’ను అంతం చేయడమే లక్ష్యం..
ఇంతకుముందు పూణేలో.. 17 ఏళ్ల బాలుడు రూ. 3 కోట్ల విలువైన పోర్షే కారును అతి వేగంతో నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. వాహనం ఢీకొనడంతో బైక్ బ్యాలెన్స్ తప్పి చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే..