జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది. వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్…
ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు ఉంటుంది కానీ ప్రభుత్వ పాఠశాల నుండి ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారని అన్నారు మంత్రి కొండా సురేఖ. వేసవి సెలవులు ముగియడంతో.. విద్యార్థులు తిరిగి బడి బాట పట్టనున్నారు. అయితే.. ప్రతి సంవత్సరం ప్రభుత్వం పాఠశాలలకు వచ్చే విద్యా్ర్థుల సంఖ్య తగ్గుతోంది. దీనికి కారణం ప్రైవేటు పాఠశాలల్లో భోదించి విద్యావిధానమే కారణం. అయితే.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యా్భోదనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా ప్రజలు మాత్రం ఆసక్తి…
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్ను విడుదల చేసింది టీజీపీఎస్సీ. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే…
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. జూన్ 1 నుంచి ప్రారంభమైన వర్షాల ప్రభావంతో.. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి చెందారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక సర్వే నివేదిక ప్రకారం.. గత రెండు రోజుల్లో పర్భానీ, హింగోలి జిల్లాల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి.
ఓ వ్యక్తి చనిపోవడంతో అతడి అంతిమయాత్రను నిర్వహించారు కుటుంబీకులు. అయితే.. ఇంటి నుంచి స్మశానం వరకు డప్పుచప్పుళ్లతో బాణసంచాలు కాల్చుతూ సదరు వ్యక్తి భౌతికకాయాన్ని తీసుకువెళ్తున్నారు బంధువులు. అయితే.. అంతిమయాత్ర ఊరేగింపు కొనసాగుతుండగా.. బాంబులు పేల్చడంతో.. అక్కడ సమీపంలో ఉన్న తేనెతెట్టుకు తగిలింది. ఇంకేముంది.. ఆ తేనెతెట్టుకున్న తేనటీగలు ఒక్కసారిగి అంతిమయాత్ర ఊరేగింపులో ఉన్న జనాలపై దాడి చేయడం ప్రారంభించారు. దీంతో.. అంతిమయాత్రలోని మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి బంధువులు తలోవైపు పరుగులు తీశారు. United Kingdom: మా…
మడికొండ సత్య సాయి కన్వెన్షన్ హాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య పరిచయ, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
2024 టీ20 ప్రపంచకప్లో భాగంగా.. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో కెనడాను ఓడించి పాకిస్తాన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెనడాపై పాకిస్తాన్ గెలిచినప్పటికీ.. ఆ జట్టుకు సమస్యలు తీరలేదు. కాగా.. పాకిస్తాన్ జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 16న ఐర్లాండ్తో జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఫ్లోరిడాలో వాతావరణం పాక్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఆడిన 3…
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారని, ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంపై తెలంగాణ బంద్ కు బీఆర్ఎస్ పిలుపినిచ్చిందని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్,పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇవాళ వారు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలుగా మేము కొట్లాడామని, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు వెళ్ళిందన్నారు. ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని, చంద్రబాబు…
వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడి పండు ఒకటి. పండ్లకు రారాజు మామిడి పండు. మామిడి పండు తినడం అంటే అందరికీ ఇష్టమే. అయితే.. మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్లు ఎ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.