కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. అయితే.. ఈనేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ మాట్లాడుతూ.. ఈరోజు ఏజెన్సీలతో సమావేశం అయ్యాము. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పానని, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాని ఆయన తెలిపారు. టైం బౌండ్…
యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను 13 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన కుర్రాడు కలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. యాపిల్ (Apple) అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతోంది. ఈవెంట్ మొదటి రోజున ఆపిల్ తన వినియోగదారుల కోసం అనేక పెద్ద ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో ఆపిల్ యొక్క ఈ వార్షిక ఈవెంట్లో చాలా మంది వ్యక్తులు భాగమయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన విభిన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.…
విద్యుత్ కొనుగోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లాలో మాట్లాడుతూ.. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారని, నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి…
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని 15 మ్యూజియంలకు తాజాగా బాంబు ఉన్నట్లు హెచ్చరికలు వచ్చినట్టు పోలీసులు ఇవాళ (బుధవారం) చెప్పుకొచ్చారు.
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భారీ మెజారిటీ ఎన్నిక కావడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
చంద్రబాబు నేతృత్వంలో నేడు ఏపీ కేబినెట్ కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.