నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు.
చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు
5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా…
జనగామ జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారు.బాధితుల వద్ద నుండి అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీ ద్వారా కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నరు. 2024 ఫిబ్రవరిలో జనగామలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో,స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారంటూ ఫోన్ చేసి ఫేక్ మెయిల్ ఐడి తో ఆర్డర్ కాపీని పంపి సైబర్ నేరగాల్లో నమ్మ బలికిస్తున్నారు.నిజమేనని నమ్మి ఇంటర్వ్యూ కొరకు…
గత రెండు రోజులుగా బీఆర్ఎస్ నాటకం ఆడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. వారి అరాచకం తెలంగాణ మొత్తం చూసిందని, నిన్న అప్రాప్రేషన్ బిల్లు పై బీజేపీ మాట్లాడకుండా చేసారన్నారు. మా గొంతు నొక్కారని ఆయన మండిపడ్డారు. అప్పటికే మేము ఓపికతో ఉన్నామని, బీఅర్ఎస్ నేతలకు ఇష్టం లేకుంటే వాక్అవుట్ చేయాలన్నారు. వెల్ లోకి వెళ్లి అరవడంతో సభ్యులెవరూ మాట్లాడేందుకు రాలేదని, ఈరోజు కూడా…
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక అహంకారి, ఫ్యాక్షనిస్ట్, ఫ్యూడల్ గా లాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తాలిబన్ సంస్కృతికి వారసుడిలా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో రేవంత్ రెడ్డి…
ప్రస్తుత సమాజంలో గర్ల్‌ఫ్రెండ్ అనగానే ప్రేయసి అని.. బాయ్‌ఫ్రెండ్ అనగానే ప్రియుడు అనే అర్థం వచ్చేయడం బాధ పరిచే అంశం. ఈ క్రమంలోనే ఈ రోజుల్లో స్నేహితుల్ని ఇతరులకు పరిచయం చేయాలంటే ఇబ్బందికరంగా మారింది. కానీ జాతీయ గర్లఫ్రెండ్స్ దినోత్సవం ఉద్దేశం పూర్తిగా వేరు. ఇందులో ప్రేమకు చోటు లేదు.. కేవలం స్నేహానికి మాత్రం చోటు ఉంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది.
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా.. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రజలకు గౌరవనీయమైన గవర్నర్ సందేశమిచ్చారు. గౌరవనీయులైన తెలంగాణ సోదర సోదరీమణులారా, ప్రగాఢమైన వినయం మరియు లోతైన గౌరవ భావంతో, నేను ఈ రోజు తెలంగాణ కొత్త గవర్నర్‌గా…