అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో కేటీఆర్ రన్నింగ్ కామెంట్రి, సభను తప్పు దోవ పట్టించే విధంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అగౌరపరిచేలా ఎక్కడా మాట్లాడలేదన్నారు. గతంలో కేసీఆర్ మహిళలను వ్యక్తి గతంగా కించపరిచే మాటలు మాట్లాడిన సబితమ్మకు గుర్తు లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళ గవర్నర్‌ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ప్రజలకు తెలుసు అని, సీఎల్పీ గా భట్టి…
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.
మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాము.. కంటతడి పెట్టుకున్న సబితారెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఆమె మండిపడ్డారు. భట్టి మాటలు బాధకరమని, భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి.…
ఖమ్మం టూ సూర్యాపేట వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. సూర్యాపేట హైవే పై ఎంట్రీ వద్ద ఫ్లై ఓవర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఫ్లై ఓవర్ మంజూరుకు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించగా ఆర్ అండ్ బీ ప్రఫోజల్స్ కు ఎన్ఎచ్ఏఐ ఆమోదం తెలిపింది. దీంతో.. ఫ్లై ఓవర్ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో చర్చించి సత్వరమే పనులు…
“తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా "అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.
పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ… జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం…
పెద్దలకు టీబీ బీసీజి టీకాలు వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను కూడా ఏఎన్ఎంలు క్రియేట్ చేయాలన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతీయ టీబీ నిర్మూలనా కార్యక్రమంపై సమీక్షించారు.
శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది.