Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఏ ఏడాదికి సంబంధించిన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా విడుదలైంది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ శుక్రవారం(ఆగస్టు 2) సాయంత్రం ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడ గణేశుడి ఉత్సవాలు ప్రారంభించి 70 ఏళ్లు పూర్చి అవుతున్నందున.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీ ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేశుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడు ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు ఉత్సవ నిర్వాహకులు.
Read Also: Drinking Water: ఒక రోజులో ఎంత నీరు తాగాలి?.. కొద్ది మందికి మాత్రమే తెలుసు!