తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల…
యూపీలోని సోన్‌భద్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని తన ఇంటి నుంచి 3 నెలలుగా కనిపించకుండా పోయిన ఒక మహిళ.. యూపీలోని సోన్‌భద్రలోని గుహ లోపల నాగినిలా ప్రత్యక్షమైంది. ఆ మహిళ అచ్చం పాములాగే బుసలు కొడుతూ అసాధారణ స్థితిలో కనిపించింది. ఆ మహిళ నాగిని లాగే భూమిపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎక్సైజ్‌శాఖలో సంస్థాగత మార్పులు చేసేలా ఏపీ సర్కార్ చర్యలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పని తీరు మెరుగు పరిచే విషయమై కసరత్తు చేస్తుంది. స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో- సెబ్ రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులు చేసేలా చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులపై అధ్యయనం చేసేందుకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. 19 మంది సభ్యులతో కూడిన కమిటీని…
సీఎం రేవంత్ రెడ్డి కావాలని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని టార్గెట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ అన్నారు. మా నియోజకవర్గాల్లో దళిత సోదరులు ఓట్లు వేస్తేనే మేము గెలిచామన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడతామని చెప్పినా స్పీకర్ మాకు అవకాశం ఇవ్వలేదన్నారు కోవా లక్ష్మీ అన్నారు. సభా వ్యవహారాల మంత్రి మమ్మల్ని కూర్చోమని అనలేదని, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కించపరిచారన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు…? అని, ఎస్సీ వర్గీకరణ…
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కు అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని, దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన ఈ తీర్పును స్వాగతిస్తున్నాం, ఈ గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవతోనే ఎస్సీల 30 ఏళ్ల కల నెరవేరిందని, ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలించిందన్నారు…
తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో జరిగిన ఈ కేబినెట్ భేటీ దాదాపు గంటన్నరపాటు సాగింది. మంత్రివర్గంలో కీలక అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. వయనాడ్ ఘటన, రేషన్ కార్డులు, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు, ఇంటి స్థలం కేటాయింపు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై చర్చ కొనసాగింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్…
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా.. ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడినట్లు తెలిసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన.. సోనియమ్మ నాయకత్వం.. అంటూ ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మహిళల పాత్ర ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోతున్నారన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయని, అసెంబ్లీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలం నాలుగున్నర గంటలు నిల్చుంటే మాకు మైక్ ఇవ్వలేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి…
గంటన్నర పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ…