ఫ్రాన్స్లో 'చిడో' తుఫాను విధ్వంసం సృష్టించింది. మయోట్ ప్రాంతంలో తుఫాను కారణంగా వందలాది మంది మరణించారు. అణుదాడి తర్వాత జరిగిన విధ్వంసంలా చాలా ప్రాంతాల్లో విధ్వంస దృశ్యాలు నెలకొన్నాయి. తుఫాను దాటికి చాలా రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడింది. అలాగే.. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య వేలకు చేరుకోవచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు.
రూ.4లకే బిర్యానీ.. ఏపీలో ఎగబడ్డ జనం.. బిర్యానీ… ఈ మాట వినగానే నోరూరని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సీజన్ అయినా బిర్యానీ హవా ఎప్పుడూ యథావిధిగా ఉంటుంది. పండగలైనా, వేడుకలైనా, బిర్యానీ లేకుండా ఏనాడు పూర్తవ్వదు. పార్టీలు అయినా, ప్రత్యేక రోజులు అయినా గెస్టుల కోసం బిర్యానీ ఆర్డర్ అనేది మస్ట్ ఐటమ్ అయిపోయింది. మన భారతీయుల జీవనశైలిలో అది విడదీయలేని భాగంగా మారిపోయింది. తాజాగా అనకాపల్లిలో ఒక హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా, నిర్వాహకులు…
పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్! సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్బాస్ సీజన్ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్బాస్ సీజన్ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్బాస్ సీజన్ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్కి చేరేసరికి…
నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం. ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్న సభ. ఇంద్రసేనారెడ్డికి సంతాపం తెలపనున్న శాసనమండలి. రెండు బిల్లులను ఆమోదించనున్న తెలంగాణ అసెంబ్లీ. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ. నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్కు చంద్రబాబు.…
నిద్రలో పళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..! విశాఖపట్నంలోని ఒక వ్యక్తి పళ్ల సెట్ మింగడంతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. 52 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తనకు కృత్రిమ పళ్ల సెట్ అమర్చుకున్నాడు. సెట్ అటు ఇటు ఊడిపోతుండడంతో, నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయి, తెలియకుండానే ఆయన దాన్ని మింగేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. పళ్ల సెట్ కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కుంది. అయితే ఎడమ ఊపిరితిత్తి సహజంగా పనిచేస్తుండటంతో శ్వాసకోణంలో…
భద్రాద్రి జిల్లా సరిహద్దులోకి పెద్దపులి.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు ములుగు జిల్లా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. పినపాక ఇల్లందు కొత్తగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఈ పులి అటు ములుగు జిల్లాలోకి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. గత మూడేళ్ల క్రితం కూడా కరకగూడెం ఆళ్లపల్లి రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పర్యటించిందని అన్నారు. అప్పటిలో ఒక…
ముంబైలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వర్లీ ప్రాంతంలోని అన్నీ బిసెంట్ రోడ్డులోని అట్రియా మాల్ ఎదురుగా ఉన్న పూనమ్ ఛాంబర్స్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే 10 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంతరం.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
లండన్లో నివసిస్తున్న 24 ఏళ్ల భారతీయ యువతి హర్షిత బరేలా హత్యకు గురైంది. నవంబర్ 14న ఆమె మృతదేహాన్ని కారు ఢిక్కీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు హత్యపై తల్లి సుదేష్ కుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త తనను చంపేస్తానని తన కూతురు కొన్ని వారాల క్రితమే చెప్పిందని తెలిపింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్లో జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది.
చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చల్లని గాలి, తక్కువ తేమ చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ క్రమంలో అలోవెరా జెల్ ఒక గొప్ప ఎంపిక. కలబందలో సహజంగా ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా.. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి.