AA 22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఫస్ట్ లుక్ & గ్లిమ్స్ రిలీజ్ డేట్ లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘AA22’ (వర్కింగ్ టైటిల్) గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ కావడంతో, దీనిపై ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Also Read : NTRNeel : ఫస్ట్ లుక్ కూడా రాకుండానే రూ. 55 కోట్ల ఓవర్సీస్ డీల్.. NTR మాస్ ర్యాంపేజ్
Also Read
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Aadarsha Kutumbam Trailer: 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
- Thaman: త్రివిక్రమ్ వల్లే 'ఓజీ' సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8న చిత్రబృందం ఒక భారీ మీడియా ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ వేదికపైనే సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ను విడుదల చేయనున్నారు. ప్రేక్షకులకు ఈ ప్రాజెక్ట్ యొక్క థీమ్ ను పరిచయం చేయడమే కాకుండా, సినిమా కథాంశంపై ఒక చిన్న గ్లింప్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్’ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అని, ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపిస్తారని టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ మరియు టాప్ క్లాస్ VFX కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. 2027 వేసవి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న రాబోయే అప్డేట్తో ఈ సినిమాపై ఉన్న సస్పెన్స్ వీడనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!