మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, వరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అసంతృప్తిగా.. రాజకీయాల్లో హాట్ హాట్‌గా ఉన్న తరుణంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను అభినందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. కాగా.. మహాయుతి కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి ఠాక్రేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. అయితే వారు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.
Read Also: Minister Payyavula Keshav: ఢిల్లీ పర్యటనలో పయ్యావుల.. కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ
సమావేశం అనంతరం శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అధికార పక్షం, ప్రతిపక్షాలు కలిసి పని చేసేందుకు రాజకీయ పరిపక్వత కనబరచాలని అన్నారు. ‘ఈరోజు మా పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కలిశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోసం పని చేస్తూ దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా (అధికార పార్టీ, ప్రతిపక్షం) ఇద్దరూ కలిసి పనిచేయాలి. రాజకీయ పరిపక్వత ఉండాలి.” అని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఈ సమావేశం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అవకాశాలకు దారితీసింది. ఏక్‌నాథ్ షిండే అసంతృప్తి తర్వాత, భవిష్యత్తులో ఏర్పడే కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది సూచనగా పరిగణించబడుతుందా అనే ప్రశ్నలు ఈ సమావేశం నుండి లేవనెత్తుతున్నాయి.
Read Also: Lok Sabha: విప్ జారీ చేసినా డుమ్మా.. 20 మంది బీజేపీ ఎంపీలపై అధిష్టానం ఆగ్రహం