SURIYA : 2026 సూర్య లైనప్.. కంబ్యాక్ మాములుగా ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 2026 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వరుస పెట్టి భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన సూర్య, తన అభిమానులకు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ జిత్తు మాధవన్ (ఆవేశం ఫేమ్) దర్శకత్వంలో వస్తున్న ‘సూర్య 47’ (Suriya 47) పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : AA 22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఫస్ట్ లుక్ & గ్లిమ్స్ రిలీజ్ డేట్ లాక్
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
మలయాళ దర్శకుడు కావడంతో ఈ సినిమా కూడా అదే స్టైల్‌లో ఉంటుందని అందరూ భావించారు. కానీ, దర్శకుడు జిత్తు మాధవన్ స్పందిస్తూ.. ఇది పక్కా తమిళ కమర్షియల్ సినిమా అని హామీ ఇచ్చారు. ఈ చిత్రం ఒక యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్. ఇందులో సూర్య ఒక విభిన్నమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. కొందరు విచిత్రమైన వ్యక్తులతో కూడిన ఒక టీమ్‌ను లీడ్ చేస్తూ, ఒక పెద్ద కేసును సాల్వ్ చేసే క్రమంలో వచ్చే నవ్వులు, యాక్షన్ ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. ఇందులో నజ్రియా నజీమ్, నస్లెన్ కె. గఫూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవలం జిత్తు మాధవన్ సినిమా మాత్రమే కాకుండా, సూర్య ఖాతాలో మరో రెండు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా కరుప్పు ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న ‘సూర్య 46’ సినిమా వేసవి కానుకగా విడుదల కానుంది. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సమాచారం. మొత్తానికి 2026 సంవత్సరం సూర్య కెరీర్‌లో అత్యంత కీలకమైన మరియు బిజీ ఇయర్ కాబోతోంది.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి