Inter Exams: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఎగ్జామ్ హాల్స్‌లో సీసీ కెమెరాలు..
- నేటి నుంచి మార్చి 24 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు..
- ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు..
- పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు..
- విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానున్నాయి. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిబంధన పెట్టారు. ఒక్క నిమిషం ఆలస్యం అయిన నిబంధనల ప్రకారం విద్యార్ధులకు పరీక్ష హాల్ లోకి నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వెలుతురు ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
Read Also: US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు
Also Read
అయితే, ప్రతి పరీక్ష గదిలోనూ సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు జిల్లా స్థాయి పరీక్ష కమిటీలను కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్, సిట్టింగ్ స్వ్కాడ్ లు నిరంతరం తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యార్ధులు సకాలంలో ఎగ్జామ్స్ సెంటర్ లకి చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రం దగ్గర ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్ధులు సమయ పాలన ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం లేదని తెలిపారు. ఏదైనా అత్యవసర సమస్యలు తలెత్తితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రలో రూమ్, టోల్ ఫ్రీనెంబర్ 1800 425 1531కి కాల్ చేయాలని సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!