తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది.. చేసిన అప్పులు సరిగా చెప్పలేదు.. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తప్పు పట్టిందని అన్నారు.
ఈ రోజు ఇండియా ఉమెన్స్-వెస్టిండీస్ ఉమెన్స్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. నవీ ముంబై మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు అలవోక విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో చేధించింది.
శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే.. రోగనిరోధక శక్తి వేగంగా బలహీనమైపోతుంది. ఈ క్రమంలో.. ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా.. జీవనశైలిలో మార్పులు, చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తి కారణంగా వల్ల జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే.. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ బొప్పాయిని తినండి.…
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కొత్త చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్‌కు గోవా కోర్టు నోటీసులు పంపింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తన పేరును పేర్కొన్నందుకు సంజయ్ సింగ్ నుండి సీఎం ప్రమోద్ సావంత్ భార్య 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, వరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా.. రాజకీయాల్లో హాట్ హాట్‌గా ఉన్న తరుణంలో ఈ భేటీ జరిగింది.
ఓ చిన్నారి ఆడుకుంటూ విక్స్ మూత మింగి మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని సారెడి బాడి పట్టణంలో చోటు చేసుకుంది. 14 నెలల చిన్నారి ఆడుకుంటున్నాడని గమనించని తల్లిదండ్రులు.. అతని వద్ద ఉన్న విక్స్ బాక్స్ మూత మింగి మృత్యువాత చెందాడు. విక్స్ మూత మింగగానే వెంటనే.. చిన్నారి కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి చెందారు. మాధవన్‌ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చగా.. గుండెపోటుతో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాధవన్ చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు. అంతకుముందు రాజీవ్ గాంధీతో కూడా కలిసి పనిచేశారు.
కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని.
హ్యుందాయ్ క్రెటా EV భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 సంవత్సరంలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటి రోజున ప్రారంభించబడుతుంది. జనవరి 17న హ్యుందాయ్ క్రెటా EV ఇండియాలో లాంచ్ అవుతుంది.
2024లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) సేల్స్ భారీగా జరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఓలా సెగ్మెంట్లో నంబర్-1గా కొనసాగుతోంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో కంపెనీ రిటైల్ విక్రయాల సంఖ్య 4 లక్షల యూనిట్లను దాటింది.