మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు.
నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లోని ప్రాంగంణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్‌గా గుర్తించారు.
2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. 'అజెండా ఆజ్ తక్' కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్‌లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది.
ఓ యువకుడు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం చేస్తున్నాడు.. ఆ జాబ్‌ను వదిలేయడానికి తన నాలుగు వేళ్లను తానే కోసుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.
మరోసారి వార్తల్లోకెక్కిన నూహ్.. రెండు పార్టీల మధ్య రాళ్ల దాడి, యువతి మృతి హర్యానాలోని నుహ్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో శుక్రవారం పరస్పర విబేధాల కారణంగా రెండు పార్టీల మధ్య భారీ రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ఆ…
అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో.. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై దానం నాగేందర్ మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ మా బంధువని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరం అన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం విచారం వ్యక్తం చేస్తున్నా అని తెలిపారు. బెయిల్ దొరకడం…
యూపీలోని షాజహాన్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో పగులగొట్టి హత్య చేసింది. అనంతరం.. భర్త మృతదేహంపై ఇటుకలను పడేశారు. ఉదయం తన తల్లి ఇంటికి వెళ్లిన భార్య రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పింది. మృతదేహంపై తల తప్ప మరెక్కడా గాయాలు లేకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు.
ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న ఇండిగో విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడి ఆరోగ్యం క్షీణించింది.