తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది.. చేసిన అప్పులు సరిగా చెప్పలేదు.. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తప్పు పట్టిందని అన్నారు. ఏడాదిలో మీరు అప్పులు చేశారంటూ సభ్యులు ప్రశ్నించారు.. అప్పులపై హరీష్‌రావు అనేక ఆరోపణలు చేశారన్నారు. తాను చెప్పే వివరాలు తప్పని ఆర్బీఐ పేరుతో కొన్ని పత్రాలు చూపిస్తున్నారు.. ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లు చెప్పడం హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.
Read Also: Annamalai: విజయ్-త్రిష ఎయిర్‌పోర్ట్ విజువల్స్ లీక్.. దీని వెనక డీఎంకే ప్రభుత్వ ప్రమేయం..
బీఆర్‌ఎస్ నేతలు పెండింగ్ బిల్లులే రూ.40వేల 150 కోట్లు పెట్టారు.. అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7లక్షల 19వేల కోట్లు అని భట్టి విక్రమార్క తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు అప్పు చేశామని.. తాము ఏం చేయలేదని ఆరోపిస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. ఏడాదిలో తాము చేసిన అప్పుల వివరాలను సభ దృష్టికి తీసుకొస్తున్నాం.. రూ.52 వేల 118 కోట్లు అప్పు చేశాం.. రూ. 26 వేల కోట్లు వడ్డీ చెల్లించామని తెలిపారు. రూ. 8855 కోట్లు అదనంగా ఆదాయం నుండి వచ్చింది కట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. దుబారా ఎవరు ఖర్చు చేయలేదు.. 1 లక్ష 18 వేల 364 కోట్లు అప్పులకు చెల్లించాం.. తెచ్చిన అప్పుల కంటే… కట్టిన చెల్లింపులే ఎక్కువ అని అన్నారు.
Read Also: Konda Murali: నేను అవినీతి సొమ్ము తినే వ్యక్తిని కాదు: కొండా మురళి
రూ. 40 వేల కోట్లు పెండింగ్ బిల్లులు పెడితే.. రూ. 12 వేల కోట్ల బిల్లులు క్లియర్ చేశామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పదేళ్లు భోజనం సప్లై చేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు.. దీంతో పిల్లలకి ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తున్నారన్నారు. బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని భావించే తాము.. మెస్ ఛార్జీలను పెంచామని, కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ఇది తమ కమిట్‌మెంట్ అని భట్టి విక్రమార్క అన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ అంటూ హరీష్ చెప్తున్నారు.. 2024లో 3లక్షల 88 వేల కోట్లు హరీష్ పెట్టిన బడ్జెట్ వివరాలే ఆర్బీఐ పేరుతో చెప్తున్నారన్నారు. బడ్జెట్‌లో పెట్టిన అంశాలే ఆర్బీఐ చెప్తుంది.. ఆర్బీఐ కొత్తగా అడిట్ చేయదని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ వివరాలతోనే ఆర్బీఐ వివరాలు చెప్తుంది.. హరీష్ రావు చెప్తున్న వివరాలు…ఆయన పెట్టిన బడ్జెట్ పత్రాల లోనివేనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.