Electric Scooter: అర్ధరాత్రి ఓ ఇంట్లో తగలబడిన ఎలక్ట్రికల్ స్కూటర్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్
- అర్ధరాత్రి ఓ ఇంట్లో తగలబడిన ఎలక్ట్రికల్ స్కూటర్
- సకాలంలో మంటలను ఆర్పివేయడంతో భారీ నష్టం తప్పినట్లైంది
- ప్రధాన కారణాలు బ్యాటరీలు లో క్వాలిటీ / ఫాల్టీ బ్యాటరీ సెల్స్ & మాడ్యూల్స్ తో తయారవడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గూడెంలో అర్థరాత్రి ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తగలబడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే యజమాని అప్రమత్రం కావడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో భారీ నష్టం తప్పినట్లైంది. ఎలక్ట్రికల్ స్కూటర్లు తగలబడడానికి లేదా అగ్ని ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు లిథియం-అయాన్ బ్యాటరీతో సంబంధం కలిగి ఉంటాయి. భారత్ లో గత కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రధాన కారణాలు బ్యాటరీలు లో క్వాలిటీ / ఫాల్టీ బ్యాటరీ సెల్స్ & మాడ్యూల్స్ తో తయారవడం. చౌకైన లేదా సర్టిఫైడ్ కాని సెల్స్ ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, థర్మల్ రన్‌వే జరుగుతుంది. ఇది బ్యాటరీలో ఒక సెల్ వేడెక్కి మిగతా సెల్స్‌ను కూడా తగులబెట్టే చైన్ రియాక్షన్.
Also Read:AA 22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఫస్ట్ లుక్ & గ్లిమ్స్ రిలీజ్ డేట్ లాక్
Also Read
- Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
- Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
- Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
ఓవర్ఛార్జింగ్ (Overcharging)
బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినా రాత్రంతా ప్లగ్‌లో పెట్టి ఉంచడం, తప్పు ఛార్జర్ ఉపయోగించడం వల్ల బ్యాటరీ అధిక వేడెక్కుతుంది. చాలా మంది రాత్రి ఛార్జ్ పెట్టి నిద్రపోతారు. ఇది ప్రమాదకరం.
బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) లోపాలు. BMS బ్యాటరీ టెంపరేచర్, ఛార్జ్/డిశ్చార్జ్‌ను కంట్రోల్ చేస్తుంది. దీనిలో లోపం ఉంటే ఓవర్‌హీటింగ్, షార్ట్ సర్క్యూట్ జరుగుతాయి.
ఫిజికల్ డ్యామేజ్ లేదా యాక్సిడెంట్
ప్రమాదంలో బ్యాటరీ కేసింగ్ పగిలిపోవడం, నీరు లోపలికి వెళ్లడం, షాక్ తగలడం వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతాయి.
తప్పు ఛార్జింగ్ పద్ధతులు తప్పు / నాన్-ఒరిజినల్ ఛార్జర్ ఉపయోగం
ఛార్జింగ్ సమయంలో అధిక టెంపరేచర్ (45°C పైన) లేదా చాలా తక్కువ టెంపరేచర్లో ఛార్జ్ చేయడం
ఛార్జింగ్ సమయంలో స్కూటర్‌ను ఇంట్లో, బెడ్రూమ్ లాంటి చోట పెట్టడం
మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ & పేలవమైన డిజైన్
బ్యాటరీ ప్యాకింగ్ సరిగా లేకపోవడం, వైరింగ్ లోపాలు, చౌక చైనీస్ సెల్స్ ఇంపోర్ట్ చేసి సరిగా టెస్ట్ చేయకపోవడం.
ఇండియాలో జరిగిన చాలా ఘటనల్లో ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫాల్టీ బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి (2022లో జరిగిన ప్రాథమిక నివేదికలు).
జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?
బ్రాండెడ్, సర్టిఫైడ్ (అరై, BIS మార్క్) స్కూటర్ మాత్రమే కొనండి.
ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే ఉపయోగించండి.
ఛార్జింగ్ సమయంలో స్కూటర్‌ను బయట ఓపెన్ స్పేస్‌లో పెట్టండి (రాత్రంతా ఛార్జ్ చేయకండి).
బ్యాటరీ వాపు, వేడి, వాసన, లీకేజీ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌కు చూపించండి.
అధిక టెంపరేచర్ (45°C పైన) లేదా తక్కువ టెంపరేచర్లో ఛార్జ్ చేయకండి.
ఈ రోజుల్లో మంచి బ్రాండ్లు (Ather, Ola, Bajaj Chetak, TVS iQube మొ.) బ్యాటరీ సేఫ్టీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి కాబట్టి, సరైన బ్రాండ్ ఎంచుకుంటే రిస్క్ చాలా తక్కువ.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..