టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. అతనిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. ఇక మైదానంలో ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో చెప్పనవసరం లేదు. ప్రత్యర్థులు అతన్ని కవ్వించారంటే.. వారికి మూడినట్లే. తనదైన స్టైల్‌లో వారికి ఇచ్చిపడేస్తాడు. ఇక.. బయట మాత్రం ఎంతో ప్రశాంతంగా తన కుటుంబంతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే.. తాజాగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. దీంతో.. మహిళా జర్నలిస్టుకు గట్టిగా క్లాస్ పీకాడు.
Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం తిరస్కరణ..
అసలు విషయానికొస్తే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మూడు టెస్టులు జరగగా.. ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఈ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా గురువారం గబ్బా నుంచి మెల్‌బోర్న్‌కు చేరుకుంది. ఈ క్రమంలో.. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో పాటు కూతురు వామికా, కొడుకు అకాయ్ కోహ్లీలతో కలిసి మెల్‌బోర్న్ విమానాశ్రయంలో కనిపించగానే ఆస్ట్రేలియా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది.
Nitin Gadkari: లివ్ ఇన్ రిలేషన్, స్వలింగ వివాహాలు సమాజానికి ప్రమాదకరం..
తన పిల్లలు ఫోటోలు తీయవద్దని విరాట్ కోహ్లీ చెప్పాడు. అయినా ఆసీస్ మీడియా వినలేదు. వారిని వీడియోలు తీయడం చేసింది. దీంతో కోహ్లీ ఒక్కసారిగా ఫైరయ్యాడు. ఈ క్రమంలో ఓ మహిళా జర్నలిస్ట్‌ను గట్టిగా మందలించాడు. వారిని తీసిన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Virat Kohli had a confrontation with the Australian media in Melbourne after they were taking pictures of his family without permission. pic.twitter.com/SCPktXtrlU
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) December 19, 2024