ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు.. RBI గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఎఫ్‌ఈవో కంపెనీకి రూ.45 కోట్లు HMDA చెల్లించిందని కేసులు పెట్టారు.. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్టు కేటీఆర్‌పై అభియోగాలు మోపడ్డాయి..
Read Also: Bird Flu: మానవుడిలో తొలిసారిగా తీవ్రమైన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ గుర్తింపు..
కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది.. ఐఏఎస్ అరవింద్‌కుమార్.. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి రూ.8కోట్ల ఫైన్ వేసింది ఆర్బీఐ.. అధికారంలోకి వచ్చాక RBIకి రూ.8 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. అయితే, కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. అయితే, కేటీఆర్ ఆదేశాలతో నిధులు IAS అరవింద్‌కుమార్ చెల్లించారని పేర్కొంది.. HMDA చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసింది.. ఈ మొత్తంగా కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ2గా అరవింద్‌కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చింది ఏసీబీ..