భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో ఆయన్ను అపోలో హస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా.. ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మరో మైలురాయి సాధించాడు. శుక్రవారం సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్‌లను బాబర్ ఆజం వెనక్కి నెట్టాడు. టీ20ల్లో వేగంగా 11000 T20 పరుగులు సాధించాడు. ఆజం.. 298 ఇన్నింగ్స్‌ల్లోనే 11000 పరుగుల మైలురాయిని సాధించాడు. బాబర్‌కు ముందు.. 314 ఇన్నింగ్స్‌లలో ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ లెజెండ్ గేల్ అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.…
Ulefone తన సరికొత్త టాబ్లెట్ Ulefone Tab W10ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్ ఆకర్షణీయమైన డిజైన్.. శక్తివంతమైన పనితీరు, అధిక ఫీచర్లను కలిగి ఉంది. సాధారణ వినియోగదారులు, నిపుణులను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ట్యాబ్‌లో 10 అంగుళాల డిస్ప్లే, హెవీ ర్యామ్‌తో పాటు 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ ఉంది. అలాగే.. 6600mAh బ్యాటరీని కలిగి ఉంది.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 లో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు.
అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు.
మీరట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో కరుడుగట్టిన నేరస్థుడు సోను మట్కాను హతమార్చింది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. సోనూ మట్కా హషీం బాబా ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై రూ.50,000 రివార్డు కూడా ఉంది. అయితే.. దీపావళి రోజు రాత్రి షహదారాలో మామ, మేనల్లుడి జంట హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కోసం.. ఢిల్లీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
బీహార్‌లోని అర్వాల్లో ఓ నిర్మాణ సంస్థపై దాడి జరిగింది. గురువారం అర్థరాత్రి మఖమిల్పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన రోడ్డు నిర్మాణ సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కొంతమంది పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని రోడ్డు రోలర్, రెండు జేసీబీలు, రెండు హైవేలు, రెండు ట్రాక్టర్లతో కూడిన ట్యాంకర్లను తగులబెట్టారు.
అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో చెంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ పై…
త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని, దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 1.81 లక్షల…