ఈ రోజు ఇండియా ఉమెన్స్-వెస్టిండీస్ ఉమెన్స్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. నవీ ముంబై మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు అలవోక విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (62) అర్ధ సెంచరీతో రాణించింది. రిచా ఘోష్ 32, దీప్తి శర్మ 17, జెమిమా రోడ్రిగ్స్ 13 పరుగులు చేశారు. మిగత బ్యాటర్లలో అందరూ విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో కెప్టెన్ హేలీ మాథ్యూస్, చినెల్లె హెన్రీ, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్ తలో రెండు వికెట్లు తీశారు.
Read Also: LK Advani: ఎల్‌కే. అద్వానీ హెల్త్ అప్‌డేట్ విడుదల!
160 రన్స్ టార్గెట్‌తో క్రీజులోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (85) అజేయంగా నిలిచింది. 47 బంతుల్లో 85 పరుగులు చేసిన హేలీ బ్యాటింగ్‌లో 17 ఫోర్లు ఉన్నాయి. కియానా జోసెఫ్ 38, షెమైన్ కాంప్‌బెల్ 29 * పరుగులతో రాణించడంతో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో భారీ విక్టరీ సాధించింది. ఇండియా బౌలర్లలో సైమా ఠాకూర్ ఒక్కరు మాత్రమే కేవలం ఒక్క వికెట్ పడగొట్టింది. మిగత బౌలర్లు ఎవరూ వికెట్ సాధించలేకపోయారు. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-1తో సమం చేశారు. నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ గురువారం జరుగనుంది.
Read Also: First Piped Gas Capital: తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..!