ఓ చిన్నారి ఆడుకుంటూ విక్స్ మూత మింగి మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని సారెడి బాడి పట్టణంలో చోటు చేసుకుంది. 14 నెలల చిన్నారి ఆడుకుంటున్నాడని గమనించని తల్లిదండ్రులు.. అతని వద్ద ఉన్న విక్స్ బాక్స్ మూత మింగి మృత్యువాత చెందాడు. విక్స్ మూత మింగగానే వెంటనే.. చిన్నారి కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. బన్స్వారా ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో బాలుడు చనిపోయాడు.
Read Also: Ramana Gogula: వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయా.. కానీ ఈ పాట నేనే పాడాలి అనిపించింది!
చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆస్పత్రికి చేరుకుని పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వైద్యుడు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి గేటుకు తాళం వేసి వైద్యశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిబ్బంది కొరతపై అసహనం వ్యక్తం చేశారు. కాగా.. ఆ తల్లిదండ్రులకు 18 సంవత్సరాల తరువాత ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారి కోసం ఎన్నో మొక్కులు, ఎన్నో దేవుళ్లను కొలిచారు. చివరకు వారికి కొడుకు పుట్టడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ ఆనందం ఎన్నో రోజులు లేకుండా పోయింది. చిన్నారి మృతితో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
Read Also: Noida: పనిలో నిర్లక్ష్యం.. ఉద్యోగులకు సీఈవో ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే..!