రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
హెచ్1బీ వీసా గురించి శోధిస్తున్న ప్రాంతాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఆ తరువాత స్థానాల్లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.
Kishan Reddy: బీజేపీ నేతల మూసి నిద్ర రెండో రోజుకు చేరింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి బీజేపీ మూసీ నిద్ర మొదలైంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ముగియనుంది.