తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ…
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు, శీతల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈరోజు మరోసారి గ్రూప్-1కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. Go-29 అంశంతో పాటు ఇతర పిటిషన్ల పై నేడు హై కోర్టులో కీలక విచారించనున్నారు. నేటి హై కోర్టు విచారణపై అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
Ponnam Prabhakar: హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి డిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ అసెంబ్లీలో అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ నుంచి 1,942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీలకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు..