Ponnam Prabhakar : భారత రత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నివాళులు అర్పించారు. అనంతరం పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భారతరత్న క్యాలండర్ ను ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు ఘాట్ ప్రాంగణంలో ఐ క్యాంప్ ను ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దు బిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కి సంబంధించిన బిడ్డ అని ఆయన వ్యాఖ్యానించారు. వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడానికి మన అందరికీ గర్వ కారణమన్నారు మంత్రి పొన్నం. వారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారి జ్ఞాపకాన్ని, వారు ఇచ్చిన మార్గదర్శకత్వం ఈనాటి యువత అవలంభించినట్లైతే అందరూ సన్మార్గంలో నడుస్తారన్నారు.
Bandi Sanjay : 340 మందికి నియామక పత్రాలు అందజేసిన బండి సంజయ్
బహుభాషా కోవిదుడుగా, అపార జ్ఞానంతో , అపార చాణక్యుడిగా రాజకీయంగా పదవులే తన వద్దకు వచ్చే విధంగా మౌనంగా ఉంటూనే ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం అయినా గా మారు మూల ప్రాంతం నుండి భారత ప్రధాని కావడం మన అందరికీ గర్వ కారణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగి ఇతర దేశాలతో నిల్బడడంలో ఆర్థిక సంస్కరణలు చేసిన ఘనుడు అని, విదేశాంగ విధానం ,విద్యా వ్యవస్థ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు అనేకమైన సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావుకి ఘన నివాళులు అర్పిస్తూన్నానన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా మంచి సన్మాన మార్గంలో ఉన్నారు, యువత ఆర్థిక సంస్కరణల్లో ఆయన ను ఆదర్శంగా తీసుకుంటే విజయాలు సాధిస్తారన్నారు.
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?