తెలంగాణలో అమృత్ టెండర్స్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది విపక్షాల ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే.. తానము ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ విమానం ఎక్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. దాంతో ఢిల్లీలో ఏదో జరగబోతోందంటూ ఓ రేంజ్లో హైప్ వచ్చింది.
నేడు నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కడపలో త్రాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన గ్రామాలలో కనీస సదుపాయాలు, విద్యాశాఖలో ఖాళీలు.. అంశాలపై చర్చలు జరగనున్నాయి. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు మధ్యాహ్న ఒంటి గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. ఉదయం…
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆరంభమైన కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. ఇల కైలాసంలో జరిగే కోటి దీపాల పండుగను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.. ఇక, ఆరో రోజు కోటిదీపోత్సవం కన్నుల పండుగా సాగింది..
Revanth Reddy: ప్రజాపాలన- విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు.
Maoist Party: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతున్నది కాదు అని తెలిపారు.
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు 20 లే- అవుట్లకు గాను 5000 ప్లాట్లు మురికి నీటితో నిండి పోయి ఉందన్నారు.
నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు.. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు.. ఇక, సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే.. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు.. కానీ సురేష్ కు భూమి ఉంది.. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల అయ్యాయి. 8,180 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. కాగా.. 8,180 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను.. వాళ్లు పూర్తి కాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్మ్ ల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండవద్దని చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను అని కేటీఆర్ పేర్కొన్నారు.