తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చినట్టుగా ఇక మీదట సినిమాలకు బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చేసింది. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం మీద ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక సినీ హీరోని అరెస్ట్ చేస్తే అందరూ రాద్ధాంతం చేశారంటూ ఆయన విమర్శించారు. ఈ సంఘటనలో అల్లు అర్జున్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని అన్నారు. సినిమా హీరో వచ్చేందుకు సంధ్య థియేటర్ కి అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. రెండో తేదీన సంధ్య థియేటర్ వాళ్లు దరఖాస్తు పెట్టుకున్నారు.
CM Revanth Reddy: అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..?
మూడవ తేదీన లిఖితపూర్వకంగా పోలీసులు అనుమతి నిరాకరించారని అన్నారు. అనుమతి లేకుండా నాలుగో తేదీన అల్లు అర్జున్ సహా హీరోయిన్ అక్కడికి వచ్చారని ఒకటే దారి ఉంది హీరో హీరోయిన్ రావద్దు అని చెప్పినా వచ్చారని అన్నారు. ఒకవేళ వచ్చినా హీరో కారులో వచ్చి సినిమా చూసి సైలెంట్ గా వెళ్ళిపోతే సరిపోయేది గాని రోడ్ షో చేసుకుంటూ రావడం వల్ల తొక్కిసలాట ఏర్పడి కన్నబిడ్డను పట్టుకుని తల్లి చనిపోయిందని మరోపక్క కొడుకు చావు బతుకులో ఉన్నారని అన్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకమీదట బెనిఫిట్ షోస్కి అనుమతి ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు అధికారికంగా ప్రభుత్వం తరఫున ఏకంగా అసెంబ్లీలోనే చెప్పడంతో భవిష్యత్తులో తెలుగు సినిమాలకు తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఇక కష్టమే అని చెప్పొచ్చు.