BRS Maha Dharna: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ కూడా ధర్నాను వాయిదా వేసింది.
బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కడ పోగొట్టుకున్నామో... అక్కడే వెదుక్కునే ప్రయత్నంలో ఉందా? అంటే... ఎక్కడ పోగొట్టుకున్నారో... నిజంగా పార్టీ పెద్దలకు తెలిసి వచ్చిందా? లేక తెలిసిందని అనుకుంటున్నారా? ప్రత్యేకించి ఓ వర్గం ఓటర్లు తమకు ఎందుకు పూర్తిగా దూరం అయ్యారో కనుక్కున్నారా? ఏ విషయంలో బీఆర్ఎస్ పెద్దలకు జ్ఞానోదయం అయింది? ఇప్పుడు ఏ రూపంలో ప్యాచ్ వర్క్ మొదలు పెట్టారు?
తెలంగాణలో బీజేపీ ప్రస్తావన లేకుండా మిగతా పార్టీలు పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థి వచ్చిందా? మీతో దోస్తీ అంటే... మీతోనే దోస్తీ అంటూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుంటూ... బీజేపీ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాయా? తెలంగాణ కమలనాథులు దీన్ని తమ బలంగా ఫీలవుతున్నారా? కాషాయం కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఎలా టర్న్ అవుతోంది?