ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని తెలిపారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను.. దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగి, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కాషాయ కండువా వదిలేసి తిరిగి కారెక్కేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. బీజేపీ నుంచి లోక్ సభ బరిలో నిలిచిన ఆరూరి.... ఆ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొనడం లేదట. బయట కూడా అంత యాక్టివ్‌గా తిరక్కపోవడంతో... ఇక పార్టీ మారతారన్న…
తోటి మనుషులను ప్రేమించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావాలి.. సంఘంతో జీవించాలి అన్న క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు.
సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,18,02,726 నివాసాలను గుర్తించారు. బుధవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా.. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంది.
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తొలిసారి భేటీ అయ్యారు ప్రధాని మోడీ. ఇన్నాళ్ళు లేనిది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. పార్టీ టార్గెట్‌లో ఉన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ మీటింగ్ ద్వారా ఆయన రాష్ట్ర పార్టీ కేడర్‌కు ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారన్న చర్చ జరుగుతోంది.
జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు రానున్నాయని.. మహానగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు రానుందన్నారు.
హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.