Minister Seethakka: సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన మంత్రి..
- ప్రజాభవన్‌లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
- మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నాం- మంత్రి
- 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం- సీతక్క
- దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం
- సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడం కాంగ్రెస్ లక్ష్యం- సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని సూచించారు. ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలి.. 100 సక్సెస్ రేట్ ఉండాలని అన్నారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలి మంత్రి సీతక్క తెలిపారు. సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలి.. మండల కేంద్రం వరకు ఈ వ్యాపారం వెళ్ళాలని సూచించారు.
Read Also: Madhavilatha: మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు
Also Read
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ లక్ష్యం సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమని అన్నారు. ఆడవాళ్లకు చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పడిప్పుడే బయటపడ్డాం.. మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రి భాయి ఫూలే నిరూపించారన్నారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రి భాయి ఫూలేనని కొనియాడారు. ఆదివాసీ బిడ్డ రాష్టప్రతిగా ఉన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: Tollywood: ప్రయోగాలొద్దమ్మా.. కమర్షియల్ సినిమాలే కావాలి!
తాజావార్తలు
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!