హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రప్రథమంగా పీపీపీ మోడల్ లో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగాం.. సిఎం రేవంత్ చాలా పకడ్బందీ ప్రణాళికతో వెళ్దామన్నారు.. మాకు ఇచ్చిన ఇంస్ట్రక్షన్ లో ఆర్డినరీ పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలన్నారు.. అభివృద్ధి అంటే కేవలం పశ్చిమ దిక్కు మాత్రమే కాదు నగరం మొత్తం ఉండాలన్నారు.
Minister Komatireddy: జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు.
ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..! ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య…
కొమురం భీం జిల్లా పోలీసులతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా పోలీసులను సైతం ఉన్నతాధికారులు రప్పించారు. విద్యార్ధిని ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఒక్క వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే, జిల్లాలో మీడియాపై సైతం పోలీసుల ఆంక్షలు విధించారు. విద్యార్ధిని శైలజ స్వగ్రామానికి వెళ్లకుండా 10 కిలో మీటర్ల దూరంలో మీడియాను ఆపేశారు పోలీసులు.
ఈ రోజు ( మంగళవారం ) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.
Winter Weather: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 2024 నవంబర్ 12న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించారు. కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే చామల…