అధికారంలోకి వస్తే.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది. కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. కానీ.. చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందుతోందట.
పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 100 మార్కులతో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ విధానంను వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాలిబండ పోలీస్ స్టేషన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికయ్యింది.
విద్యుత్తు రంగంలో విధ్వంసానికి ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్ధితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ రోజు బీఆర్ఎస్కు ఎంతో గుర్తు పెట్టుకునే రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరారన్నారు. 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ మా మాట కూడా వినకుండా.. తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వెళ్లారన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ను ఓ పండుగలా జరుపుకుంటుందన్నారు.
ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి ఆగంతకులు కోటి రూపాయలను డిమాండ్ చేశారు. లేడీ వాయిస్తో ట్రాప్ చేయించి దుండగులు కిడ్నాప్కు పాల్పడ్డారు. తుపాకీని తలపై పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు.