రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు.
తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు.
కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఆ దేశపు రాయబారి రువెన్ అజర్‌కు ఆయన ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు.
Sitaphal : తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో పెరుగుతున్న సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (GI) పొందేందుకు శ్రీకొండా లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే అధ్యయనాలు జరుపుతూ గణాంకాలు సేకరిస్తున్నారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఈ ప్రాజెక్టుకు రూ. 12.70 లక్షల సహాయం అందించాలని ముందుకొచ్చింది. మొదటగా బాలానగర్ అడవుల్లో పుట్టిన ఈ సీతాఫలం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించింది.…
Weather Update: తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా... ఇటీవల వరుసగా రెండు, మూడు ఊహించని ఘటనలు జరిగాయి. లగచర్లలో రైతులు కలెక్టర్ పై తిరగబడడంతో సమస్యలు మొదలయ్యాయి. కలెక్టర్‌ని తప్పుదోవ పట్టించి రైతులు లేని దగ్గరికి తీసుకెళ్లి దాడి చేశారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరించారని, కలెక్టర్‌పై దాడికి అదే కారణం తేల్చింది సర్కార్. రెండు మూడు రోజులపాటు ఈ ఎపిసోడ్ చుట్టూనే తిరిగింది తెలంగాణ రాజకీయం మొత్తం.…
తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది.. ఇకపై 100 మార్కుల పేపర్ ఉండనుంది. ఇంటర్నల్ మార్కులను ఎత్తేసింది విద్యాశాఖ. ఇప్పటి వరకూ 80 మార్కులకే పేపర్ ఉండేది.. 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. కాగా.. ఆ పద్ధతిని విద్యాశాఖ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.