ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు. కవితను అరెస్టు చేసిన రోజు రోడ్డుపై బైఠాయించి కవితను విడుదల చేయాలని ధర్నా చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. నువ్వు చేసిన మోసానికి బీఆర్ఎస్ వాళ్లే కాదు.. కాంగ్రెస్ వాళ్లు కూడా తు తు అంటున్నారని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
Read Also: Kollu Ravindra: బీసీలను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది.. నన్ను అన్యాయంగా జైలులో పెట్టారు!
ఇంకోసారి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే జాగ్రత్త అని హెచ్చరించారు. నియోజకవర్గంలో 1100 మంది దళితులకు దళిత బంధు రాకుండా అడ్డుకున్న వ్యక్తివి నువ్వేనని తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ద్రోహివి నువ్వు, దళితుల పాలిట రాబందు నువ్వు అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో, బీఆర్ఎస్ లో మంత్రి పదవులు అనుభవించి అక్రమ ఆస్తులు సంపాదించుకున్నావని అన్నారు. 1994లో నీ ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించారు. అవినీతితో సంపాదించుకున్న వాడు ఎవడైనా సాక్షాలు పెట్టుకుంటాడా.. నీ ఇల్లు, నీ పెట్రోల్ బంక్, నూరు భూములు, విదేశాలలో ఉన్న నీ ఆస్తులన్నీ సాక్ష్యం కాదా అని తాటికొండ రాజయ్య ఆరోపించారు.