హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం సంతకాల సేకరణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత సంతకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. కర్నాటక, బిహార్ వంటి విఫలయత్నాల అనుభవాలు ఉన్నా కూడా తొలుత డేడికేటెడ్ కమిషన్ వేయాల్సిందని కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదని తెలిపారు.
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు తనను ప్రశ్నిస్తున్నారని కవిత తెలిపారు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా.. ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు కాబట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనన్నారు. మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బీసీలకు మంచి రోజులు వస్తాయి.. కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారు.. అంబేద్కర్ కృషి చేయకుంటే ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫలాలు దక్కకపోతుండేదని కవిత చెప్పారు. అదే సమయంలో బీసీ కులాలను రాజ్యాంగంలో రక్షణ కల్పించాల్సింది.. ఆనాడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేసేదని అన్నారు.
Air India : దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఇదే
మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు.. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా..? అని కవిత ప్రశ్నించారు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదు.. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు..? అని అన్నారు. మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసిందన్నారు. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది.. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని కవిత ఆరోపించారు. మరోవైపు.. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది.. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని దుయ్యబట్టారు. తాను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయన్నారు. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారని కవిత పేర్కొన్నారు.