బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయని అన్నారు. ఏడాది అయినా కేసీఆర్ జపం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పే ముఖ్యమంత్రి.. పరిపాలన చేతకాకే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి, మంత్రులకి సత్సంబంధాలు లేవని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింని తప్పుడు ప్రచారం చేశారు.. పదేండ్లలలో నాలుగు లక్షల కోట్లు తాము అప్పులు చేస్తే, ఏడాదిలో లక్ష ముప్ఫె వేల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ఏటీయం అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. పిచ్చోడి చేతిలో రాయి అయ్యింది తెలంగాణ పరిస్థితని తెలిపారు.
Low Cost 7-Seater Car: దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్.. రూ.5.32 లక్షలే!
తన మీద ఆరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కొట్లాడాలని కేటీఆర్ తెలిపారు. ఈ సంవత్సరంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేసి కమిటీలు వేసుకుందామన్నారు. ఆరు గ్యారంటీలలో అర గ్యారంటీ అమలు అయ్యిందా అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ అమలు.. వందశాతం అమలు అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పానని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పరిపాలన చాతనవడం లేదు.. సాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రెగ్యులేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.. నాలుగు లక్షల పెళ్ళిలు అయ్యాయి గానీ కళ్యాణలక్ష్మీ ఇవ్వలేదని ఆరోపించారు. 7500 రైతుబంధు కాదు.. 75 పైసలు ఇవ్వలేదని తెలిపారు.
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి లేటెస్ట్ పోస్టర్ వచ్చింది చూశారా?
రైతు ప్రమాణపత్రం కేసీఆర్ హయంలో అడుగలేదు.. రైతుబంధు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. 12 ధఫాలలో రూ. 80వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు. రైతులని బదనం చేసే కుట్ర జరుగుతుంది.. రైతులని దొంగలాగా చిత్రికరీంచే కుట్ర జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం, ఐటీ ఉంటే రైతు బంధు కట్ అంటున్నాడని.. సీఎం అంటే కట్టింగ్ సీఎం అయ్యారని విమర్శించారు. మరోవైపు.. కాళేశ్వరంని బదనం చేశారు.. మేడిగడ్డకి పర్రె పడడం కాదు.. రేవంత్ రెడ్డి బుర్రకి పర్రె పడ్డదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్ళు కాంగ్రెస్ కుట్రనేనని తెలిపారు. కోటిన్నర ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టే కాళేశ్వరంని బాగు చేయడం లేదని కేటీఆర్ పేర్కొ్న్నారు.