రోడ్లు వేయకుండా అడ్డుకుంటే వదిలేది లేదు… మంత్రి వార్నింగ్
రోడ్లు వేయకుండా అడ్డుకుంటే ఊరుకోబోమని సర్పంచ్‌లను హెచ్చరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మక్కువ మండలం కాశీపట్నం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మక్కువ మండలంలో 11 బీటీ రోడ్లుకి ఒక్క రోడ్డు మాత్రమే చేశారు.. మిగతా 10 రోడ్లు చేయనివ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.. మక్కువ మండలంలోని 21 పంచాయితీల్లో వైసీపీకి 20 మంది సర్పంచ్‌లు ఉన్నారు.. 19 ఎంపీటీసీలు వున్నారని గుర్తుచేసిన ఆమె.. అధికార కూటమి పార్టీకి ఒక్క సర్పంచ్, 2 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. ఇదే అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు.. గ్రామాల్లో అభివృద్ధి అడ్డుకుంటే వదిలేదిలేదని వార్నింగ్ ఇచ్చారు.. మాకు సహకరించండి.. లేకుంటే నేనే దగ్గరుండి రోడ్లు వేయేస్తాను అన్నారు మంత్రి సంధ్యారాణి.. మంత్రిగా నా నియోజవర్గాన్ని అభివృద్ధి చేయడకం నా కర్తవ్యం. దానిని అడ్డుకుంటే సహించేది లేదు అంటూ హెచ్చరించారు..
నేను సీఎం పదవి ఎవరినీ అడగలేదు.. దానికోసం ఎవరికీ కప్పు టీ కూడా ఇవ్వలేదు..
మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు.. నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు అన్నారు.. అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.. కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు.. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా సార్లు చెప్పాను.. వాళ్లు వినకపోవడంతోనే నేను మీడియా ముందుకు వచ్చాను అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీని మూడు నెలల ముందు కలిసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు కిరణ్‌కుమార్.. ఇప్పటికీ కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకూ సమస్య ఉందన్న ఆయన.. ఆంధ్ర ప్రదేశ్ కు పోలవరం ఒక వరం. పోలవరం పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి. 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, 900 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి పోలవరంతోనే సాధ్యం అవుతుందన్నారు..
ఉద్యోగం ఇప్పించండి..! లేదా ముగ్గురు పిల్లలతో సహా కారుణ్య ఆత్మహత్యకైనా అనుమతించండి..
తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది. పీజీ స్పెషల్ బీఈడీ చదివిన తనకు కాంట్రాక్టు పద్ధతిలో ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. తన పిల్లలు లాగా చాలా మంది పేరెంట్స్ దివ్యాంగులైన పిల్లలను కలిగి ఉన్నారని అలాంటి వారందరూ మానసికక్షోభకు గురవుతున్నట్లు వాపోయింది. స్పెషల్ బీఈడీ చేసిన తనకు ప్రత్యేక ఉపాధ్యాయురాలిగా కాంట్రాక్టు పద్ధతిలో అవకాశం కల్పిస్తే అలాంటి పిల్లలందరికీ చదువు చెప్తానని తద్వారా తనకు ఉపాధి దొరుకుతుందని కోరింది. తనకు ఉద్యోగం ఇవ్వడానికి 370 జీవో అడ్డుగా ఉందని అధికారులు చెబుతున్నారని కనీసం తన భర్త కైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంది. అయితే ఇటీవల డీఎస్సీ రాసినప్పటికి మెరిట్ రాలేదని చదువుపై మక్కువ ఉన్నప్పటికీ ముగ్గురు దివ్యాంగులైన పిల్లల బాగోగులు చూస్తూ చదవడం వల్ల 40 శాతం మార్కులు సాధించినట్లు తెలిపింది. ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కానిపక్షంలో ముగ్గురు పిల్లలతో సహా తమకు ఆత్మహత్యనే శరణ్యమని అందుకే కారుణ్య ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రజావాణిలో వినతి పత్రం అందజేసినట్లు తెలిపింది.
కేసీఆర్ కూడా రైతు భరోసా ఇస్తాం
వరంగల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. పర్యావరణానికి హాని కలగకుండా ఆర్టీసీ అప్‌డేట్ చేస్తున్నామన్నారు. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు ఏ టెక్నాలజీ వచ్చినా.. వెంటనే వరంగల్‌కు కూడా టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పారు. వరంగల్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని.. భద్రకాళి ట్యాంక్‌బండ్, టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో 25 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్ల 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని వెల్లడించారు. 4.5 లక్షల ఇండ్లను మొదటి విడతలో ఇస్తామని ప్రకటించారు. అన్ని మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజల దగ్గరకే ప్రభుత్వా్న్ని పంపిస్తామని చెప్పారు. దాదాపు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని… వాటిని స్క్రూటినీ చేసి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అనేది నిరంతర ప్రక్రియ అని.. లబ్ధిదారులకు తప్పకుండా ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతేకుండా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తి చేసి అందిస్తామని ప్రకటించారు.
దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణదని, ఈనెల 26 నుంచి ఎకరాకు 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు విలువైన పంట రుణాల మాఫీ చేసిందని, ఈ విషయంలో ఏ ఇతర రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మాఫీ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. పెద్ద మనుషులు, పది ఏండ్లు అధికారంలో ఉన్న వారు విమర్శలు చేయడం విడ్డూరం అని రైతులకు మద్దతు తెలిపే విధంగా మాట్లాడారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా HMPV వైరస్ సర్క్యులేషన్‌లో ఉంది: ఐసీఎంఆర్
చైనాలో ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్‌లో కూడా మూడు కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ భయాల మధ్య టాప్ మెడికల్ బాడీ-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ‘‘సర్క్యులేషన్’’లో ఉందని సోమవారం హెచ్చరించింది. అయితే, శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను నిర్వహించడానికి భారత్ సిద్ధమైందని పేర్కొంది. ‘‘భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా HMPV ఇప్పటికే చెలామణిలో ఉంది. HMPVతో సంబంధం ఉన్న శ్వాసకోశ వ్యాధుల కేసులు వివిధ దేశాలలో నివేదించబడ్డాయి. ఇంకా, ICMR, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్‌వర్క్ ప్రస్తుత డేటా ఆధారంగా, దేశంలో ఇన్‌ఫ్లుఎంజా-లైక్ ఇల్‌నెస్ (ఐఎల్‌ఐ) లేదా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (ఎస్‌ఎఆర్‌ఐ) కేసుల్లో అసాధారణ పెరుగుదల లేదు’’ అని ఐసీఎంఆర్ తెలిపింది. అందుబాటులో అన్ని నిఘా మార్గాల ద్వారా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తుందని, ఐసీఎంఆర్ ఏడాది పొడవునా వైరస్ ట్రెండ్స్‌ని ట్రాక్ చేస్తూనే ఉంటుందని కూడా పేర్కొంది.
మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి 09 మంది జవాన్లు మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. బీజాపూర్ జిల్లాలో జవాన్లను టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చారు. వాహనంలో జవాన్లు వెళ్తున్న క్రమంలో మందుపాతర పేల్చారు. జిల్లాలోని కుట్రు-బెద్రే రహదారిపై ఈ ఘటన జరిగింది. వాహనం డ్రైవర్‌తో సహా 9 మంది జవాన్లు, మొత్తంగా 10 మరణించారు. మరో ఐదుగురి జవాన్లకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. కూంబింగ్‌కి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు విషయాన్ని బస్తర్ ఐజీ ధ్రువీకరించారు. అబూజ్ మడ్ ఏరియాలో మావోయిస్టుల ఏరి వేత కోసం నాలుగు జిల్లాల నుంచి గత నాలుగు రోజులుగా కూంబింగ్ కొనసాగుతుంది. కూంబింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు పక్కా ప్లాన్‌తో ఎటాక్ చేశారు. బీజాపూర్ జిల్లాలో కుట్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేలి గ్రామ సమీపంలో ఘటన జరిగింది. మృతి చెందిన వారు దంతేవాడ జిల్లాకు చెందిన డీఆర్‌జీ జవాన్లు ఉన్నారు.
అమాయకులపైన ఏంట్రా మీ ప్రతాపం..ఆఫ్ఘన్‌పై పాక్ దాడిని ఖండించిన భారత్..
ఇటీవల తాలిబన్లు టార్గెట్‌గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. దీనికి తగ్గట్లుగానే తాలిబన్లు రెండు దేశాలకు మధ్య ఉన్న సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్‌ని దాటి పాకిస్తాన్‌పై దాడులు చేశారు. ఇదిలా ఉంటే, ఈ దాడులపై భారత్ స్పందించింది. ‘‘అమాయక పౌరులపై ఏదైనా దాడిని నిస్సందేహంగా ఖండిస్తున్నాం’’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ తన సొంత అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించే పాత పద్ధతని అవలంభిస్తోందని భారత్ చెప్పింది. ఆఫ్ఘన్ పౌరులపై పాకిస్తాన్ వైమానిక దాడులకు సంబంధించి మీడియా ప్రశ్నలకు ప్రతిస్పందనగా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘మహిళలు మరియు పిల్లలతో సహా ఆఫ్ఘన్ పౌరులపై వైమానిక దాడులపై మీడియా నివేదికలను గమనించాము, ఇందులో అనేక విలువైన ప్రాణాలు కోల్పోయారు. అమాయక పౌరులపై దాడులను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము’’ అని అన్నారు.
జనవరి 8న యష్ టాక్సిక్ అప్ డేట్.. ఫోటోతో కన్ఫాం చేసిన మేకర్స్
యష్ ‘కేజీఎఫ్’ సిరీస్ కంటే ముందు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరిసీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తుంది. మలయాళంలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న గీతూ మోహన్ దాస్ ఈ ‘టాక్సిక్’ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ ని పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోంది. ఈ విషయాన్ని రాకింగ్ స్టార్ యష్ ప్రకటించారు. జనవరి 8న 10 గంటల 25 నిమిషాలకి సినిమా నుంచి అప్డేట్ రాబోతోందని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్‌రెడీ సూపర్ హిట్.. కారణం అనీల్ రావిపూడే!
దిల్ రాజు తాజా ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. శంకర్ ఇండియన్ 2 రిజల్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దాంతో శంకర్ మీద విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో గేమ్ చేంజర్ కథను శంకర్ చెప్పిన్పుడు నేను ఏదైతే నమ్మానో దాని మీద శంకర్ తో చాలా సార్లు డిస్కషన్ పెట్టుకున్నాను. గేమ్ చేంజర్ రిజల్ట్ హీరోకి, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నా ప్రేక్షకులు సినిమా చూసి విజిల్స్ కొట్టే మూమెంట్స్ చాలానే ఉంటాయి. ‘శంకర్ ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా అందులో మంచి మెసేజ్ ఉండేది, అలాగే నువ్వు కూడా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఒక వేల్యూ ఉండేది’ అని ఓసారి చిరంజీవి అన్నారు. శంకర్ గేమ్ చేంజర్ కథ చెప్పినప్పుడు నేను ఫీల్ అయిన దానికి, చిరంజీవి స్టేట్‌మెంట్.. రెండూ సింక్ అయ్యాయి. కమర్షియల్ అంశాలతో పాటు రెస్పెక్ట్‌గా ఫీల్ అయ్యే సినిమా గేమ్ చేంజర్. మూడు, నాలుగున్నరేళ్ల ఎమోషన్స్‌కు మరో మూడు నాలుగురోజుల్లో ఫలితం రానుంది. సినిమా చూసే ప్రేక్షకుల నుంచి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. వారికి వావ్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి.
‘గేమ్ చేంజర్’లో నా పాత్రే గేమ్ చేంజర్ : అంజలి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ చిత్రం రాబోతోంది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. గేమ్ చేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ గారు కథ చెప్పినప్పుడు.. కారెక్టర్ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ కారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్ గారు నా పర్ఫామెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, కారెక్టర్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.