తెలంగాణలో రోజు రోజుకు ఘోరాలు, అరాచాకాలు మితీమీరిపోతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా. మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు కామాంధులు.. ఇటీవలే సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో వీడియో రికార్డుల కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగే చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. నవీన్ అనే యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Yuzvendra Chahal Divorce : స్టార్ స్పిన్నర్ చాహల్, నటి ధనశ్రీ విడాకులపై క్లారిటీ వచ్చేసింది..
మరోవైపు.. కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మాట్లాడుతూ.. ఇలా జరగడం రెండోసారి, ఇంతకుముందు కూడా ఒకసారి ఇలా జరిగిందని చెబుతున్నారు. మొదటిసారి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఈ ఘటనపై తమకు న్యాయం జరగాలని విద్యార్థులు కోరుతున్నారు.
Pani Puri: “పవర్ ఆఫ్ పానీపూరీ”.. ఏడాదిలో రూ. 40 లక్షల చెల్లింపులు.. జీఎస్టీ నోటీసులు..