B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B-1B Lancer: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. శత్రువుల గుండెల్లో దడపుట్టించే అత్యంత భయంకరమైన బాంబర్ విమానం ‘B-1B లాన్సర్’ను అమెరికా వైమానిక దళం రంగంలోకి దించింది. ఇరాన్‌తో సైనిక ఘర్షణ పెరుగుతున్న తరుణంలో, తన మార్క సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి మద్దతుగా ఈ సూపర్‌సోనిక్ విమానం మిడిల్ ఈస్ట్ ఆకాశంలో గర్జించనుంది.
READ ALSO: BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మరో వివాదం.. వైడ్ బాల్‌కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
‘బోన్’ (BONE) ఎందుకింత ప్రత్యేకం..
అమెరికా సైనికులు ఈ విమానాన్ని ముద్దుగా ‘బోన్’ (B-One) అని పిలుచుకుంటారు. ఇది కేవలం బాంబర్ మాత్రమే కాదు, అమెరికా వైమానిక దళానికి వెన్నెముక వంటిది. ఇది ఏకకాలంలో సుమారు 75,000 పౌండ్ల (34,000 కిలోలు) బరువున్న శక్తివంతమైన బాంబులు, క్షిపణులను మోసుకెళ్లగలదు. గంటకు సుమారు 1,531 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల స్థావరాలను క్షణాల్లో చిత్తు చేయగలదు.
ఇది సుమారు 60,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఒక్కసారి ఇంధనం నింపితే ఏకధాటిగా 9,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఆయుధాలు లేకుండా అయితే ఇది 12,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఈ విమానాన్ని నడపడానికి నలుగురు సభ్యుల బృందం (కమాండర్, పైలట్, ఇద్దరు ఆఫీసర్లు) అవసరం. గైడెడ్ క్షిపణులు, అణు ఆయుధాలు, సంప్రదాయ బాంబులను ఇది ప్రయోగించగలదు. దీనికి ఉన్న ఆరు ఎక్స్టర్నల్ హార్డ్ పాయింట్స్ ద్వారా అదనపు బాంబులను కూడా అమర్చుకోవచ్చు.
యుద్ధ దిశను మార్చే సంకేతం..
సౌత్ డకోటాలోని ఎల్స్‌వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన ఈ విమానం మధ్యప్రాచ్యానికి చేరుకోవడం అంటే.. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందనే సంకేతాలను ఇస్తోంది. అమెరికా వద్ద ప్రస్తుతం ఇలాంటివి 104 విమానాలు ఉన్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!