తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి సిద్దమైంది. మరికాసేపట్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా ఆరంభం కానున్నాయి. మిస్ వరల్డ్ పోటీల కోసం విజిటర్స్ గేట్స్ శనివారం సాయంత్రం 5.30కు తెరుచుకున్నాయి. సాయంత్రం 6.30కు ఇనగ్యూరల్ సెరెమనీ ప్రారంభం కానుంది. అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మే 10న ప్రారంభమయ్యే పోటీలు.. మే 31 వరకు కొనసాగనున్నాయి.…
పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తోందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. భారత జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. చచ్చే వరకు భారత భూమి కోసమే బ్రతకాలని ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హైదరాబాద్ ఎంపీ అన్నారు.…
ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు.. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్ యాదవ్ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్... సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి..
మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు మావోల ఏరివేతకు శ్రీకారం చుట్టాయి. ఈ ఆపరేషన్ లో పదుల సంఖ్యలో మావోలను మట్టుబెట్టారు. ఇదే సమయంలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై ప్రతీకార దాడులకు తెరలేపింది. అయితే ఇప్పుడు దీని ప్రభావం ఆపరేషన్ కగార్…
భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదని, దేశం ఎంతో సంయమనం పాటించిందన్నారు. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే.. ఇద్దరు ఆడబిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారన్నారు. ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదని, కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగిందన్నారు. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని ఎంపీ రఘునందన్…
తెలంగాణ ఈఏపీసెట్ పలితాలు ఆదివారం (మే 11) విడుదల కానున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. జేఎన్టీయూ, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈఏపీసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల అధికారులు వెల్లడిస్తారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. Also Read: KTR: స్థానిక ఎన్నికల్లో…
తొందర్లోనే స్థానిక ఎన్నికలు వస్తాయని, స్థానిక ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లు మోసపోయాం అని, మళ్లీ మోసపోవద్దని కేసీఆర్ చెప్పారని.. కానీ తాత్కాలికంగా మోసపోయాం అని పేరొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, రుణమాఫీ కూడా చేయలేకపోయిందని మండిపడ్డారు. రైతుబందు మొదటి పంటకే గతి లేదు అని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా నిలిచేది బీఆర్ఎస్…
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన…