జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఆరు నెలల తర్వాత ఉంటుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉప ఎన్నికల కోసం కుల సమీకరణ ఆధారంగా అభ్యర్థిని బీజేపీ నిర్ణయించబోతోందని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్‌కి ఎంఐఎంలు విక్రయించారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాజా సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Uttam Kumar Reddy: అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ… ‘ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆరు నెలల తర్వాత ఉంటుంది. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్‌కి ఎంఐఎంలు విక్రయించారు. రానున్న ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో?. అధికార కాంగ్రెస్ పార్టీకి విక్రయిస్తారా? లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా?అనేది చూడాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో కుల రాజకీయం జరిగింది. ఇప్పుడు కూడా కుల రాజకీయం జరుగుతుందా? లేదా సీనియర్ వాళ్లకి అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి’ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో సోమవారం మరణించిన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.