KTR: ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి అన్నా
ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం అవుతుండడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కుంటిసాకులతో నిర్మాణాలను ఆలస్యం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో పని చేయించడం కూడా రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి.
Bhatti Vikramarka: భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అన్నారు.
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని తేల్చి చెప్పారు. నేను క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తను.. గత 25 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతో పని చేస్తున్నాను.. నా లీడర్ కేసీఆర్.. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని హరీశ్ రావు తెలిపారు.
పాతబస్తీలోని చార్మినార్ వద్ద మరి కొద్దిసేపట్లో ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవాళ ఏపీకి కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖా మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోనీ కేంద్ర బృందం.. సీఎం చంద్రబాబుతో సమావేశం మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత బలోపేతంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కీలక అంశలపై సమీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అన్ని బస్టాండుల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎంయూఏ ధర్నాలు.. తమ డిమాండ్లు పూర్తి…
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్గా రాజుకోబోతోందా అంటే... అవును... అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు.
కాంగ్రెస్ తెలంగాణలో అధికార పార్టీ. కానీ.. పవర్లో ఉన్న పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ కనిపించడం లేదని సొంత నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా... నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే.. తల మాత్రమే ఉండి మొండెంలేనట్టుగా మారిపోయిందట తెలంగాణ కాంగ్రెస్.
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్... ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం... జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట.