నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తుంటారు. గొడవలు జరగకుండా, దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. సొసైటీకి పోలీసులు చేస్తున్న కృషి మరువలేనిది. ప్రజా సమస్యలను తీర్చేందుకు.. పోలీస్ సేవలను ప్రజల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇదే తరహాలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సైకిళ్లపై గ్రామ సందర్శన చేశారు వంగర పోలీసులు.
Also Read:Rajnath Singh: ‘‘పాలకు పిల్లి రక్షణ’’.. యూఎన్ వ్యవహారంపై ఆగ్రహం..
వరంగల్ జిల్లా భీమదేవర మండలంలోని వంగరలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వినూత్న రీతిలో ఆలోచించారు వంగర ఎస్సై దివ్య. తన సిబ్బందితో కలిసి సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 గ్రామాల్లో వంగర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామస్తులతో కొద్దిసేపు ముచ్చటించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైకిళ్లపై తమ గ్రామాలకు వచ్చిన పోలీసులను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులు తమ విధుల పట్ల చూపిన అంకితభావానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.