ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన నిర్వహించాలని నిర్ణయించారు.. జూన్ 12వ తేదీన అంటే ఎల్లుండి సాయంత్రం ఈ వేడుకలు నిర్వహించనున్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించాలని స్పష్టం చేసింది.. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కూటమి సర్కార్.. ‘సుపరిపాలన.. స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు.. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్..
నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేనే నేరుగా సిట్ ఆఫీసుకు వస్తా.. వాళ్లను వేధించొద్దు..!
లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు… ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి నరకం చూపిస్తూన్నారట.. కాళ్లు, చేతులో కట్టేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వేధించి చెవిరెడ్డి పేరు చెప్పించాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే, మీరు నన్ను అరెస్టు చేయాలని అనుకుంటే నేనే నేరుగా సిట్ ఆఫీస్ కు వస్తానని ఛాలెంజ్ చేశారు.. లిక్కర్ కేసులో నా పేరు లేకపోయినా.. నన్ను ఇరికించడానికి పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు… మీరు ఎంత ఇబ్బంది పెట్టినా నేను సిద్ధం అన్నారు చెవిరెడ్డి.
వివాహిత అదృశ్యం.. రెండు గ్రామాలు మధ్య చిచ్చు..! పీఎస్‌కు తాళాలు..!
ఓ వివాహిత అదృశ్యం కేసు.. రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రామసముద్రంలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రామసముద్రంలోని ఎగువపల్లె, శ్రీరాములపల్లి ప్రజల మధ్య వివాహిత అదృశ్యం కేసులో ఘర్షణ చెలరేగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎర్రబోయినపల్లికు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎస్సై రవికుమార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కారంపొడి చల్లి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు.. అంతేకాదు, పోలీస్ స్టేషన్‌లోకి దూసుకుపోవడానికి ప్రయత్నం చేశారు.. దీంతో, పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం మూసి వేసి, ఎస్సై రవికుమార్‌ను లోపల ఉంచిన సిబ్బంది, స్టేషన్ గేట్లు మూసేశారు. ఈ గొడవల్లో మా తప్పు లేకపోయినా మా వారిపై కేసులు పెట్టారని… దీన్ని మేం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని.. ఎస్సైను అప్పగించే వరకు స్టేషన్ నుంచి కదిలేది లేదంటూ కూర్చొని నిరసనకు దిగారు టీడీపీ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా రంగంలోకి దిగి స్థానిక కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.. దీంతో, పరిస్థితి అదుపులోకి వచ్చింది..
ఎక్స్‌లో జగన్ ఫైర్.. ప్రజలను పూర్తిగా మోసం చేశారు..!
సోషల్ మీడియా వేదికగా ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత, పారదదర్శక పాలన ఆందించాం.. విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తోంది.. రెడ్ బుక్ పాలనతో ప్రభుత్వాన్ని అస్తవ్యస్తంగా మార్చారు.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్ధుడు చంద్రబాబు.. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టి మళ్లించటానికి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్టు చేశారు.. చట్టానికి విరుద్దంగా రాజకీయ కక్షసాధింపునకు దిగారు.. టీవీ చర్చలో జరిగిన దానికి కొమ్మినేనిని బాధ్యులను చేయటం ఏంటి? అప్పటికీ ఆయన చర్చను పక్క దారి పట్టకుండా నియంత్రించారు.. కానీ, చంద్రబాబు ఒక కుట్రతో దాన్ని వక్రీకరించారని ఆరోపించారు జగన్.. ఒక పథకం ప్రకారం సాక్షి మీడియా కార్యాలయాలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులను ప్రోత్సాహించారు. మహిళల గౌరవాన్ని కాపాడతామని చెబుతూ వారితోనే దాడులు చేయించారు. రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలోనే 188 లైంగిక దాడులు, 15 హాత్యాచార సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు.. అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థిని హత్య చేసి డెడ్‌బాడీని అడవిలో పడేశారు.. మరోచోట 14 మంది టీడీపీ కార్యకర్తలు 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై ఆరు నెలల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె గర్భవతి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయ ఒత్తిడి, పోలీసుల నిర్లక్ష్యం వలన బాధితురాలి కుటుంబం రోడ్డున పడింది. మహిళలు, చిన్నారులను రక్షిస్తామన్న చంద్రబాబు వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.. పైగా ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షసాధింపునకు దిగటం చంద్రబాబుకే చెల్లింది అంటూ ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
యూపీ సీఎం యోగితో మంత్రి నారాయణ భేటీ..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం అయ్యారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఉన్న యూపీ సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది.. ఘన వ్యర్థాల ప్లాంట్ల అధ్యయనం కోసం లక్నో పర్యటనకు వెళ్లింది మంత్రి నారాయణ బృందం.. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత యూపీ సీఎం, అధికారులతో మంత్రి నారాయణ, ఏపీ అధికారుల భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో ఘన వ్యర్థాల నిర్వహణను వివరించారు ఆ రాష్ట్ర అధికారులు.. మరోవైపు, ఏపీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొరకు ఉపయోగిస్తున్న పద్ధతులను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు వివరించారు మంత్రి నారాయణ, అధికారులు.. ఏపీలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించేందుకు రావాలని యూపీ అధికారులను ఆహ్వానించారు మంత్రి నారాయణ.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..
కుల సమీకరణ ఆధారంగా బీజేపీ అభ్యర్థి.. ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఆరు నెలల తర్వాత ఉంటుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉప ఎన్నికల కోసం కుల సమీకరణ ఆధారంగా అభ్యర్థిని బీజేపీ నిర్ణయించబోతోందని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్‌కి ఎంఐఎంలు విక్రయించారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాజా సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ… ‘ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆరు నెలల తర్వాత ఉంటుంది. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్‌కి ఎంఐఎంలు విక్రయించారు. రానున్న ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో?. అధికార కాంగ్రెస్ పార్టీకి విక్రయిస్తారా? లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా?అనేది చూడాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో కుల రాజకీయం జరిగింది. ఇప్పుడు కూడా కుల రాజకీయం జరుగుతుందా? లేదా సీనియర్ వాళ్లకి అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి’ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో సోమవారం మరణించిన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పైనా విస్తృతమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఉత్తమ్ ఢిల్లీకి పయనమయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి కూడా ఉన్నారు. రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండగా.. ఇప్పుడు ఉత్తమ్ కూడా వెళుతుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర కేబినెట్‌లో కీలక మార్పులుంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పలువురి మంత్రుల శాఖలను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
“జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి..
కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా మండలి పనిచేయనున్నది. డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి భారత ప్రభుత్వం డీ.ఆర్.డీ.ఓ. (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) మాజీ చైర్మన్. భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు. 2025 మార్చి 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయననను విమానయానం, రక్షణ రంగాలలో గౌరవసలహాదారుగా నియమించింది. ఆయన రాష్ట్ర క్యాబినెట్ హోదాలో రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
‘చంపడానికి నిరాకరించినా వినిపించుకోలేదు’’.. హనీమూన్ మర్డర్ కేసులో భార్య క్రూరత్వం..
హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన భర్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారునంగా హత్య చేయించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోనమ్ తన భర్తని చంపేందుకు కిరాయి హంతకులకు రూ. 4 లక్షల ఆఫర్ చేసిందని, ఆ తర్వాత మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచినట్లు విచారణలో వెల్లడైంది. భర్త మృతదేహాన్ని లోయలోకి తోసేందుకు సోనమ్ నిందితులకు సహాయం చేసింది. జూన్ 02న తూర్పు ఖాసీ హిల్స్ లోని సోహ్రా ప్రాంతంల(చిరపుంజి) ప్రాంతంలో ఒక జలపాతానికి సమీపంలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు కలిసి ఈ మర్డర్‌కి ప్లాన్ చేశారు. ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు. హంతకుల్లో ఒకరు బెంగళూర్‌లో ఈ జంటను కలిశారు. ఈశాన్య భారతదేశానికి వెళ్లే విమానంలో వీరంతా ప్రయాణించారు. ఒకే నగరానికి చెందిన వ్యక్తులు కావడంతో రాజా రఘువంశీ నిందితులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
రణరంగంగా లాస్ ఏంజెల్స్.. మెరైన్ కమాండోలను మోహరించిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు వలసదారులను నిర్బంధించడంపై కాలిఫోర్నియా అట్టుడుకుతోంది. లాస్ ఎంజెల్స్‌లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడానికి ట్రంప్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వందలాది మంది అరెస్టులు జరిగాయి. మరోవైపు, నిరసనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. ఆపిల్ స్టోర్స్, జ్యువెల్లరీ స్టోర్స్ లక్ష్యంగా లూటీలు చేస్తున్నారు. వేలాది మంది నిరసనకారులు రోడ్లను ఆక్రమించారు. పోలీసు వ్యాన్లను తగలబెట్టడంతో పాటు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. 2000 మంది నేషనల్ గార్డ్స్ లాస్ ఎంజెల్స్‌లో మోహరించారు. 700 మంది మెరైన్ గార్డ్స్ అల్లర్లను అడ్డుకునేందు ప్రయత్నిస్తున్నారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్స్, టియర్ గ్యాస్‌ని ఉపయోగిస్తున్నారు.
24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్..అఖండ 2 రికార్డ్
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా అఖండ టూ తాండవం అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అద్భుతంగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే, కొంచెం ఎబౌట్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే, ఈ టీజర్‌కి రికార్డు వ్యూస్ వచ్చాయి. 24 గంటలలో 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ టీజర్ ఇంకా యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
షర్టు బటన్లు తీసేసి స్రవంతి చొక్కారపు ఘాటు సొగసులు..
యాంకర్ స్రవంతి చొక్కారపు చేస్తున్న అందాల అరాచకం మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. బిగ్ బాస్ తర్వాత వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తోంది. అప్పుడప్పుడు పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు కూడా చేస్తోంది. బుల్లితెర ప్రోగ్రామ్స్ ప్రైవేట్ ఈవెంట్లతో బిజీబిజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఘాటుగా సొగసులను చూపిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి చొక్కా బటన్లు తీసేసి బ్రా అందాలతో రెచ్చిపోయింది. పొట్టి నిక్కర్ వేసుకుని థైస్ షో చేస్తోంది. కుర్రాళ్లకు మత్తెక్కించే ఘాటు సొగసులతో ఊపేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.