సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిరుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మొదలైన వివాదం తీవ్ర తుఫాన్‌గా మారుతోందేతప్ప తీరం దాటడం లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత రాజకీయ వైరం ఉంది.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక సమరమే అంటూ.... ఉద్యోగ సంఘాల జేఏసీ పేరుతో వచ్చిన ప్రకటనపై సీఎం తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం.
పౌర రక్షణ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన శత్రు దాడిలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజలను సిద్ధం చేస్తోంది. పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడూ పౌర రక్షణ నిర్వహిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించేందుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటాయి. పౌరులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తాయి. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. శత్రు దాడి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఈ మేరకు…
ఆయన కండువా మార్చేశారు.. కండువా మార్చిన ఉద్దేశం నెరవేరకపోవడంతో పార్టీ, ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారు. కుంపటి పెడితే దారిలోకి వస్తారని ఆనుకున్నారో ఏమో కానీ.. పెద్దాయన రివర్స్ గేర్ వేశారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ?. అది ప్రైమ్ లొకేషన్. గుంట, అర గుంట భూమి కాదు.. 12 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు ఓ నేత. ఆక్రమణ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ.. ఇప్పటి వరకు దానివైపు అధికారులు ఎవరు కూడా కన్నెత్తి…
Pochampally: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలో భాగస్వాములు అవుతున్న మిస్ వరల్డ్ – 2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నట్లు I&PR విభాగం అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్ పై ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో…
Kishan Reddy: కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంది అన్నారు.
కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరికీ నమస్కారం.. బాగున్నారా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన మాకు ఆదర్శం.. మీ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ సమస్యలు వినే అవకాశం…