తెలంగాణలో కొత్త లాక్డౌన్ సడలింపులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. కానీ, కేసుల తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. ఇంకా పాజిటివ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.. అయితే, రెండు జిల్లాలను కలుపుతూ ఉన్న ఒక పంచాయతీలో మాత్రం.. రెండు లాక్డౌన్లు అమలు చేయాల్సిన పరిస్థితి..…
తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని… అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని ఫైర్ అయ్యారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకి ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. 18 ఏళ్ళు నిండిన భారత ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయడమే లక్ష్యంగా పాలన…
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇక, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ లో కాస్త…
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం…
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై భారీగా నమోదయ్యాయి… అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే తెలంగాణలో లక్షల వాహనాలు సీజ్ చేశారు.. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వాహనాలను కోర్టుకు సమర్పిస్తామని చెబుతున్నారు.. ఈ ఉల్లంఘనలు ఎక్కువగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.. ఇక, ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొత్తం 8.79 లక్షల కేసులు నమోదు అయినట్టు…
నైరుతి రుతుపనాలు ఇవాళ్టితో తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపించాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో కూడా పూర్తిగా ప్రవేశించాయి. ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియార్ స్థాయి వరకు ఉన్నది. దీని ప్రభావంతో ఈ నెల 11వ తేదీన ఉత్తర బంగళాఖాతం & పరిసర ప్రాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా…
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖల 2020-21 సంవత్సర వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఎవరు మమ్మల్ని అడగలేదు..కానీ పారదర్శకత కోసం వార్షిక నివేదికలను విడుదల చేస్తూ ఉన్నామన్నారు. కేసీఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని.. దేశ పౌరుని సగటు తలసరి ఆదాయం 1,27,768 ఉంటే …తెలంగాణ రాష్ట్ర పౌరుని తలసరి ఆదాయం 2,27,145గా ఉందని తెలిపారు. 2020-21లో తెలంగాణ ఐటి రంగం ఎగుమతులు 1 లక్ష…
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు.. మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్,లక్ష్మి గా వారిని గుర్తించారు పోలీసులు. వారం రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అటు వారం…
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా గత 12న మూతపడిపోయిన పాస్ పోర్టు కేంద్రాలు నేటి నుంచి యధావిధిగా పునః ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు పగటిపూట ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో పాస్ పోర్టు కేంద్రాలు ఈరోజు నుంచి పనిచేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. సాధారణ సమయాల్లో పాస్ పోర్టు సేవా కేంద్రాలు పని చేయనున్నాయి.
తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు మారనున్నాయి. మరో పదిరోజుల పాటు కొనసాగనున్న లాక్డౌన్.. సడలింపు సమయం పెరగనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు సమయం.. ఆ తర్వాత మరో గంట గ్రేస్ పీరియడ్‌గా ఉంది. రేపట్నుంచి ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు లాక్డౌన్ నుంచి సడలింపు ఉండనుంది. ప్రజలంతా ఇళ్లకు చేరుకునేలా మరో గంట వెసులుబాటు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల…