జల జగడం.. ఏపీకి- కేంద్రానికి ఏమైనా ఒప్పందం ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కొత్త వాదన సరికాదన్న ఆయన.. నీటి వాటాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి అనడంలో ఆంతర్యం చెప్పాలి? ఏపీ ప్రభుత్వానికి- కేంద్రానికి ఏమైనా ఒప్పందం ఉందా? అంటూ నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేసిన ఆయన.. నీటి వాటాల కేటాయింపులో ఆనాడే తెలంగాణకు అన్యాయం జరిగిందని.. ఏపీకి 32 శాతం వాటా ఉంటే 66శాతం తరలింపు జరుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఇక, విద్యుత్ ఉత్పత్తి నిబంధనలకు లోబడే జరుపుతున్నామన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. హైదరాబాద్ లో సెటైలర్స్ అనే వాదన ఏపీ చేస్తోందని మండిపడ్డ ఆయన.. ఉద్యమంలో కూడా మేం సెట్లర్స్ గురించి మాట్లాడలేదన్నారు. కేంద్రానికి ఇచ్చిన మాట ప్రకారం – బ్రిజేష్ కుమార్ తీర్పు వచ్చే వరకు ఏపీ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేసిన ఆయన.. నీటి పంపకాల పై ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు.. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై- నీటి పంపకాల పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు శ్రీనివాస్ గౌడ్.
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!