ఈటల రాజేందర్ రాజీనామాను కాసేపటి క్రితమే తెలంగాణ స్పీకర్ ఆమోదించారు. రాజీనామాని ఆమోదిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఈటల.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్. ఈటల రాజీనామాపై గంట వ్యవధిలోనే స్పందించిన తెలంగాణ స్పీకర్..వెంటనే ఆమోద ముద్ర వేశారు. ఈ…
భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేసీఆర్.. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని…
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఆయన.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్… ఇక, ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసిన ఈయన.. ఈనెల 14నవ తేదీన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ…
తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే నా అజెండా అని ప్రకటించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పటికే టీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. అంతకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలు కురుక్షేత్రంగా అభివర్ణించారు.. అక్కడ కౌరవులు, పాడవులకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు.. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని ఈ సందర్భంగా…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి అఫిషియల్‌గా రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించనున్నాడు. అనంతరం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రమే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ మధ్యే గాంధీ ఆస్పత్రిని, వరంగల్ ఎంజీఎంను సందర్శించి కోవిడ్ బాధితులను పరామర్శించి భరోసా కల్పించిన ఆయన.. ఇప్పుడు మరింత దూకుడు పెంచుతున్నారు.. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 వ తేదీ తర్వాత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు.. ఇక, ఇందులో భాగంగా.. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి…
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. ఇప్పటికే కొత్త వేతన సవరణ అమలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. పెంచిన పీఆర్సీని జూన్ నెల నుంచి అమలు చేసి.. వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.. నోషనల్ బెనిఫిట్‌ను 2018 జులై ఒకటి నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి, క్యాష్ బెనిఫిట్‌ను 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించగా.. కాసేపటి…
తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో.. సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రికి ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నట్టుగా వర్షం దంచికొట్టింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వరుసగా మూడు రోజుల పాటు.. అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి…
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్…