Phone Tapping Case: సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు బెయిల్.. కానీ..!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట
- మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మార్చిన ధర్మాసనం
- విచారణకు సహకరించాలన్న కోర్టు ఆదేశాలు
- కఠిన నిబంధనలతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఉన్న మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మారుస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, మరో రెండు వారాల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించడంతో, ధర్మాసనం ప్రభాకర్ రావుకు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..
Also Read
కేసు నమోదైన ప్రారంభ దశలో ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడం, ఆ తర్వాత ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తే విచారణకు సహకరిస్తానని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు ఆయన భారత్‌కు తిరిగి వచ్చి సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆయన తన పాత సెల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డేటా విషయంలో సరిగ్గా సహకరించడం లేదని ప్రభుత్వం గతంలో వాదించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని భావించిన ఉన్నత న్యాయస్థానం ఈ ఊరటనిచ్చింది.
అయితే, ఈ బెయిల్ మంజూరు చేస్తూనే సుప్రీంకోర్టు అత్యంత కఠినమైన షరతులను విధించింది. ప్రభాకర్ రావు తన పాస్‌పోర్ట్‌ను వెంటనే కోర్టులో సరెండర్ చేయాలని, ట్రయల్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, కేసులోని సాక్షులను ప్రభావితం చేయడం కానీ, కీలకమైన డిజిటల్ ఆధారాలను టాంపర్ చేయడం కానీ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ ఈ నిబంధనల్లో దేనినైనా ఉల్లంఘించినట్లు తేలితే, మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దాఖలు చేయబోయే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్రను మరింత స్పష్టం చేయనుంది.
UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!